
మార్కాపురం (DN5 NEWS) : రాయవరం సమీపంలో ఉన్న క్వారీల వద్ద టిప్పర్ లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు క్షణాల్లోనే మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైనది. బస్సు హైదరాబాద్ నుండి పామూరు వెళ్తుందని తెలిపిన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40మంది ప్రయానికులు ఉండగా 10 మంది సజీవ దహనం అయ్యారు. మిగిలిన వాళ్ళు గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.





