Home ప్రకాశం ఆదరణతో వృత్తిదారుల జావితాల్లో నూతన వెలుగులు : ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

ఆదరణతో వృత్తిదారుల జావితాల్లో నూతన వెలుగులు : ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

405
0

గిద్దలూరు : ఆదరణ పధకం సాంప్రదాయ వృత్తిదారుల జావితాల్లో నూతన వెలుగులు నింపుతాయని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో ఆదరణ-2 మెగా గ్రౌండింగ్ మేళా నిర్వహించారు. సభలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలోని 6 మండలాల బీసీ సోదరులకు ఆదరణ2 పథకం క్రింద వివిధ రకాల పనిముట్లు అందజేశారు.

గిద్దలూరు మండలానికి చెందిన 135మందికి రూ.1.95లక్షలు, రాచెర్ల మండలానికి చెందిన 115 మందికి రూ.93.5లక్షలు, అర్ధవీడు మండలానికి చెందిన 68 మందికి రూ.11.6లక్షలు, కంభం మండలానికి చెందిన 68 మందికి రూ.33.8లక్షలు, బేస్తవారిపేట మండలానికి చెందిన 124 మందికి రూ.1.14కోట్లు, కోమరోలు మండలానికి చెందిన 50 మందికి రూ.30లక్షలు, గిద్దలూరు నగర పంచాయతీకి చెందిన 19 మందికి రూ.8.8లక్షలతో పని ముట్లు పంపిణీ చేశారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా గిద్దలూరు మండలానికి చెందిన 54 మందికి రూ.34.5లక్షల విలువైన చెక్కులను అందజేశారు.

ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ బిసి సోదరలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఆదరణ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. లబ్దిదారులు కేవలం 10 శాతం వాటాతో ప్రభుత్వం 90శాతం సబ్సిడీ ఇచ్చి పని ముట్లు అందజేస్తుందన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే ఎస్సి, ఎస్టీ, కాపు, మైనార్టీ సోదవులకు వివిధ రకాల రుణాలు, ఇన్నోవా కార్లు, ట్రాక్టర్లు, జేసీబీలు ప్రభుత్వం అందిస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ భాస్కర్ నాయుడు, గిద్దలూరు మండల పరిషత్ అధ్యక్షుడు కడప వంశిధర్ రెడ్డి, రాచెర్ల మండల పరిషత్ అధ్యక్షురాలు రెడ్డి లక్ష్మీ దేవి, అర్ధవీడు మండల పరిషత్ అధ్యక్షుడు నన్నెబొయిన రవికుమార్ యాదవ్, బేస్తవారిపేట మండల పరిషత్ అధ్యక్షుడు వేగినటి ఒసురా రెడ్డి, రాచెర్ల జడ్పీటీసీ బద్దీటి నాగరత్నమ్మ, కంభం టీడీపీ అధ్యక్షుడు కేతం శ్రీనివాసులు, గిద్దలూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు మస్తాన్, రాచెర్ల టీడీపీ అధ్యక్షుడు జీవనేశ్వర రెడ్డి, మాజీ గిద్దలూరు మండల టీడీపీ అధ్యక్షుడు ఆవులమంద శ్రీనివాసులు, ఎస్సి కార్పొరేషన్ ఈడి కోటేశ్వరరావు, ఆరు మండలాల ఎంపీడీఓలు, ఆర్ అండ్ బి డిఈ, వివిధ బీసీ సంఘాల నాయకులు, ఆరు మండలాల పంచాయతీ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.