బాపట్ల (DN5 News) : పట్టణ ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు ‘మన వార్డు, మన ఎమ్మెల్యే’ కార్యక్రమం పున ప్రారంభించామని శాసన సభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. పట్టణంలోని రైలుపేట 4వ వార్డులో మంగళవారం పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, సిమెంట్ రోడ్ల మరమ్మతులపై ప్రజలు ఆయనకు వివరించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిశీలించి, ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మంగళవారం ఒక వార్డు చొప్పున పర్యటించి, పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా చేతల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, యూనిట్ ఇన్ ఛార్జ్ పరిశా రమేష్ గౌడ్, అద్దంకి సోమ శేఖర్ పాల్గొన్నారు.






