బాపట్ల (Bapatla) : పట్టణంలో ముప్పలనేని శేషగిరిరావు 6వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ (Bapatla Education Society) అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ శేషగిరిరావు సేవలను కొనియాడారు. రాజకీయ రంగంలో ప్రజలకు విశిష్ట సేవలు అందించారని అన్నారు. బాపట్ల విద్యా సంస్థల అభివృద్దిలో శేషగిరిరావు కృషి ఎప్పటికీ మర్చిపోలేనిదని అన్నారు. కార్యక్రమంలో ముప్పలనేని సుమంత్, టిడిపి పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, బొట్టు కృష్ణ, పులి వాసు పాల్గొన్నారు.






