వరంగల్ : ఎల్కతుర్తి మండలంలోని జగన్నాథపూర్కు చెందిన పెండ్యాల దుర్గయ్య (65) అనే వృద్దుడు మూడు రోజుల క్రితం కాలువలో పడి తీవ్రంగా గాయపడగా స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. ప్రధమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ వృద్దుడు మృతి చెందాడు. వృద్దుడైన దుర్గయ్య- ప్రమీలకు పిల్లలు లేరు. ఇద్దరూ గ్రామంలో కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. వారసులెవ్వరూ లేకపోవడంతో వృద్ధురాలైన భార్య ప్రమీల కుండ పట్టి భర్త దుర్గయ్యకు అంత్యక్రియలు చేసింది. ఆ ఘటన పలువురనీ కన్నీరు పెట్టించింది.