చీరాల (DN5 News) : పట్టణంలోని యుటిఎఫ్ కార్యాలయం మహిళా దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయుల సందడితో కళకళలాడింది. ఈ సందర్భంగా శాసన సభ్యులు ఎంఎం కొండయ్య హాజరై మాట్లాడారు. సమాజంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రధానమని అన్నారు. మహిళా ఉపాధ్యాయులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. సభలో యుటిఎఫ్ నాయకులు బి బిక్షాలు బాబు, బి పద్మ, పి సురేష్, సీతారామరాజు, సౌజన్య, కుర్ర రామారావు, సిద్ధం పాపారావు, రావి పద్మావతి, యోగంబిక పాల్గొన్నారు.






