Home ఆంధ్రప్రదేశ్ ఎపి చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు : సీఎం చంద్రబాబు

ఎపి చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు : సీఎం చంద్రబాబు

158
0

అమరావతి : గతంలో మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారని, ఐదేళ్ల తర్వాత తిరిగి పనులు ఆయన చేతులమీదుగానే ప్రారంభించుకోవడం చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లుగా రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయని అన్నారు. మళ్లీ మోదీ చేతుల మీదుగానే పనులు పునఃప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో మోదీని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారని, ఇటీవల మోదీని కలిసినప్పుడు చాలా గంభీరంగా ఉన్నారని అన్నారు. పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో ఉన్నారని అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు మద్దతు ప్రకటించారు.