Home ప్రకాశం పాలిటెక్నిక్ తో ఉజ్వల భవిష్యత్తు

పాలిటెక్నిక్ తో ఉజ్వల భవిష్యత్తు

228
0

చీరాల : పాలిటెక్నిక్ లో చేరిన విద్యార్థులు వారి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలికారని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ కోలా వెంకటరమణ బాబు పేర్కొన్నారు. చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ తరగతుల ప్రారంభ సందర్భంగా శుక్రవారం కళాశాల ఆడిటోరియంలో పాలిటెక్నిక్ పై అవగాహన, ఉపాధి అవకాశాలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.

ఇంటర్మీడియట్ తో పోలిస్తే పాలిటెక్నిక్ తో మంచి భవిష్యత్తు ఉందన్నారు. ప్రాక్టికల్ సబ్జెక్టులు ఉండటం వలన విద్యార్థి అయా రంగాలలో మెరుగైన ప్రతిభ కనపరచ గలుగుతారని తెలిపారు. పాలిటెక్నిక్ మూడు సంవత్సరాలు పూర్తయిన తరువాత ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఇంజనీరింగ్ కు కూడా వెళ్ళవచ్చునని తెలిపారు. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిస్కో కంప్యూటర్ కోర్సు వంటివి నేర్చుకోవడం ద్వారా అదనపు ప్రయోజనాలు ఉంటాయన్నారు.

పాలిటెక్నిక్ విద్యార్థులకు జగనన్న వసతి దీవెన ద్వారా ఉచిత విద్యవకాశం ఉందన్నారు. ఇప్పటి నుంచి క్రమశిక్షణ, ప్రణాళిక యుతంగా కష్టపడితే ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చని చెప్పారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు పొందగలుగుతారని అన్నారు.

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తారని వాటిని గౌరవించాల్సిన బాధ్యత విద్యార్థులకు ఉందన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యతను తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ సీ సత్యనారాయణ, సీతాలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.