చీరాల : పంచాయితీరాజ్ శాఖ ఎఒ విజయలక్ష్మి నిద్రిస్తూ తన వంటిపై బంగారు ఆభరణాలను తొలగించి హ్యండ్బ్యాగ్లో పెట్టుకుని నిద్రిపోయింది. గుర్తుతెలియని వ్యక్తులు కిటికీలో నుండి కర్రతో హ్యాండ్బ్యాగ్ను తీసుకుని అందులోని బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం లేచి చూసుకుంటే బ్యాగు కిటికి వద్ద పడిఉండటంతోపాటు బ్యాగులో సొమ్ము లేకపోవడంతో చోరీజరిగినట్లు గుర్తించి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని డిఎస్పి డాక్టర్ జి ప్రేమకాజల్, రెండో పట్టణ సిఐ రామారావు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.