పొన్నూరు : పట్టణంలోని 14వ వార్డు సచివాలయం లో మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో సచివాలయం పరిధిలోని ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ పెన్షన్ లు, ఇతర పెన్షన్లపై సమీక్ష చేశారు. సిబ్బంది నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు అయ్యేవిధంగా సిబ్బంది కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా అందరికీ అందే విధంగా సిబ్బంది పని చేయాలని ఆదేశించారు.