Home ప్రకాశం వచ్చే ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు : జర్నలిస్ట్ యూనియన్ సభలో మాగుంట

వచ్చే ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు : జర్నలిస్ట్ యూనియన్ సభలో మాగుంట

571
0

కొండపి: యాజమాన్యానికి జర్నలిస్టులకు మంచి సంబంధాలు ఉండాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కొండేపి నియోజకవర్గ మూడవ ప్రాంతీయ సదస్సు మంగళవారం కొండేపిలో జరిగింది. సదస్సుకు విచ్చేసిన మాగుంట మాట్లాడుతూ నేడు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలు సెకండ్లలో సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. జర్నలిస్టులు నిబద్ధతతో పనిచేయాలని, వారికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

వచ్చే ఉగాదికి జిల్లాలో లక్షా యాభై వేల ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉందని, కొండేపి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. తాను ఈరోజు జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడానన్నారు. అలాగే కొండేపి నియోజకవర్గంలోని రైతులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మూసీ నదిలోకి సాగర్ నీరు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. వైయస్సార్సీపి కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ జర్నలిస్టులు నిజమైన వార్తలు రాయాలని కోరారు. ఏపియుడబ్ల్యూజె రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టులు ఏ పార్టీకి అనుకూలం కాదని నిజంగా జరిగేవే ప్రజలకు ప్రభుత్వాలకు తెలుపుతామని అన్నారు. జర్నలిస్టుల హక్కులకోసం ఏపీ డబ్ల్యూడబ్ల్యూజె నిరంతరం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త చింతల వెంకటేశ్వర్లు, వైస్సార్ సీపీ నాయకులు బి వెంకటేశ్వరరావు, ఉపేంద్ర, జిల్లాలోని పత్రికా ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.