Home ప్రకాశం భూస్వాములు, సామ్రాజ్యవాదులకు ఒకే లక్యం కెఎన్ పీఎస్

భూస్వాములు, సామ్రాజ్యవాదులకు ఒకే లక్యం కెఎన్ పీఎస్

408
0

ఒంగోలు: సామ్రాజ్యవాదులు భూస్వాములు ఒకే లక్ష్యంతో పని చేస్తున్నారన్నారని కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్ అన్నారు. మన్నం ప్రసాద్ స్ఫూర్తితో హిందూత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటాల నిర్మాణంలో భాగంగా రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దుడ్డు ప్రభాకర్ మాటాడుతూ ప్రపంచ దేశాలకు భిన్నంగా ఇండియాలో కులం ఉందన్నారు. మనదేశంలో ఫాసిజం హిందుత్వ రూపంలో ఉందన్నారు. దేశ భక్తి పేరుతో దళిత గిరిజన ముస్లింలను వెంటాడి వేటాడి చంపేస్తున్నారని అన్నారు. హిందుత్వ ప్రభుత్వ రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై అర్బన్ మావోయిస్టు ముద్రవేసి కొత్త చట్టాలు తెచ్చిమరీ జైళ్ళల్లో కుక్కుతున్నారన్నారు.
కుల నిర్మూలన పోరాట సమితి ఏర్పాటు హిందుత్వానికి వ్యతిరేకంగానే జరిగిందన్నారు. హిందువులు, సామ్రాజ్యవాదులు, భూస్వాములు ఒకే లక్ష్యంతో పని చేస్తున్నారన్నారు. మన్నం ప్రసాద్ అమరత్వం స్ఫూర్తితో కులం ఉన్నంతవరకు కుల నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ఆధారం చేసుకుని హిందూ మతోన్మాదులు కత్తులతో వీరంగం చేస్తున్నంతకాల కుల నిర్మూలనా పోరాట సమితి ప్రజల్లో బ్రతికే ఉంటుందన్నారు.

విప్లవ రచయితల సంఘం రాష్ట్ర నాయకురాలు వరలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచంలో యురేనియం తవ్వకాలన్నీ ఆదివాసీల ప్రాంతాల్లోనే జరుగుతున్నా యన్నారు. నల్లమలలో కూడా ఆదివాసీ ప్రాంతాల్లోనే జరుగుతున్నా యన్నారు. అడవులు నశిస్తే పర్యావరణ విధ్వంసం జరుగుతుందన్నారు. నల్లమల్ల పతనం మన నాగరికత పతనం అన్నారు. యురేనియం ఖనిజం ఎంత శక్తివంతమైనదంటే పరిశోధన జరిపిన శాస్త్రవేత్తలు సైతం క్యాన్సర్ తో చనిపోయారన్నారు.2005లో రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు, ప్రజా సంఘాలు బలంగా వ్యతిరేకించడంతో యురేనియం ప్రాజెక్టు ఆగిందని అదే ప్రాజెక్టు ఇప్పుడు నియంతృత్వ మోడీ ప్రభుత్వంకి అనుకూలంగా పనిచేస్తున్న జగన్, కెసిఆర్ లు మళ్లీ ఆహ్వానిస్తున్నారన్నారు. గతంలో నల్లమలలో ఆదివాసీలు అడవులను కాపాడుకున్నారని ఇప్పుడు యురేనియం పేరుతో నల్లమల అడవులను కార్పొరేట్ శక్తులు, ప్రభుత్వాలు కలిసి ఖాళీ చేస్తున్నా యన్నారు. ఇప్పుడు ప్రజలు ప్రజాసంఘాలు మళ్లీ పోరాటాల ద్వారా యురేనియం ప్రాజెక్ట్ ని వ్యతిరేకిం చాలని కోరారు. ఒంగోలులోని ఇండియన్ మెడికల్ హాల్ లో సోమవారం జరిగిన సభలో కెఎన్ పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి దుడ్డు వెంకట్రావు అధ్యక్షతన జర్నలిస్ట్ డానీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం కృష్ణయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాకళా మండలి, కెఎన్ పీఎస్ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.