Home ప్రకాశం శ్రీ గౌతమి ఆధ్వర్యంలో “మీ బలాన్ని గుర్తించండి – మీ జీవితాన్ని మీరే మలుచుకోండి” అంశంపై...

శ్రీ గౌతమి ఆధ్వర్యంలో “మీ బలాన్ని గుర్తించండి – మీ జీవితాన్ని మీరే మలుచుకోండి” అంశంపై వర్క్ షాప్

397
0

చీరాల : “మీ బలాన్ని గుర్తించండి – మీ జీవితాన్ని మీరే మలుచుకోండి” అంశంపై హైదరాబాద్ లీడర్ అండ్ మేకింగ్ అకాడమీ, అమేజ్ కెరీర్ గైడెన్స్ సహకారంతో వర్క్ షాప్ శ్రీ గౌతమి విద్యాసంస్థల ఆధ్వర్యంలో చీరాల బాపనమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించారు. వర్క్ షాప్ లో డాక్టర్ పొలవరపు వెంకటేశ్వరప్రసాద్ విద్యార్థులను ప్రోత్సహించారు. లీడర్ మేకింగ్ అకాడమీ ప్రతినిధి పెండ్యాల ప్రసాద్, అమేజ్ కెరీర్ గైడెన్స్ ప్రతినిధి వేపురి శ్రీనివాస్ విద్యార్థులకు వివిధ అంశాలను వివరించారు. వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్ ప్రణాళికలు, అందుకు అనుగుణంగా వత్తిడిలేకుండా చదవడం అంశాలపై విద్యార్థులకు ఆసక్తి కలిగించారు. కార్యక్రమంలో శ్రీ గౌతమి విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఎంసీహెచ్ వెంకటేశ్వర్లు (ఎంవి), డైరెక్టర్ లు శ్యామ్ ప్రసాద్, కె వెంకటేశ్వర్లు(కెవి), కె శ్రీనివాస్(ఏఓ), వరప్రసాద్, ఎమ్యెసార్ పాల్గొన్నారు.