Home సినిమా చమటలు చిందిస్తోన్న చందమామ

చమటలు చిందిస్తోన్న చందమామ

314
0

హైదరాబాద్ : సోషల్ మీడియా వచ్చాక సినీ సెలబ్రిటీల తీరే మారిపోయింది. అభిమానులతో, ఆడియన్స్‌తో టచ్‌లో ఉండేందుకు ఇంతకుముందులా వెనుకాడటం లేదు. తాము ఏం చెప్పాలనుకున్నా, ఏంచేయాలనుకున్నా, ఏం చూపాలనుకున్నా ఆన్‌లైన్లో అమాంతం అందించేస్తున్నారు. ట్విట్టర్ మొదలు ఇన్ స్టాగ్రామ్ దాకా సినిమా ప్రముఖుల కోలాహలమే. అయితే ఇందులో అందగత్తెల జోరు చాలా ఎక్కువ. పూటకో షొటోషూట్, రోజుకో బికినీ షో చేసేస్తున్నారు. కెమెరా ముందు గ్లామర్‌ను ఉబికిస్తూ, ఉప్పొంగిస్తూ రెచ్చిపోతున్నారు. అయితే, సినీ బ్యూటీస్ మరో ప్రచార అస్త్రం… జిమ్ వీడియోస్.

కాజల్ అగర్వాల్… 34 ఏళ్ల వయస్సు. 15 ఏళ్ల కెరీర్. అయినా దూసుకుపోతోంది. అయితే, గ్లామరస్ ‌గా కనిపించటం, తెరపై యంగ్ హీరోయిన్స్‌తో పోటీ పడటం మామూలు విషయం కాదు. అందుకు, కఠోరమైన శ్రమ కావాలి. అదే చేస్తోంది కాజు. పర్ఫెక్ట్ షేపులో ఉండటంతో పాటు ఆరోగ్యంగా కనిపించటానికి, ఉత్సాహంగా చెలరేగిపోవటానికి ఈ సుందరి జిమ్ బాట పట్టింది. జిగేల్‌ మనే గ్లామర్ కోసం భారీ బరువులు ఎత్తుతోంది. వ్యాయామాలు చేస్తూ తనని తాను ఫిట్ అండ్ హిట్ ‌గా మార్చుకుంటోంది! తాజాగా డెబ్బై కిలోల బరువులు ఎత్తుతూ ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్‌ని అవాక్కు చేసేసింది రాణి మిత్రవింద.