Home ప్రకాశం ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహిస్తున్న రోటరీ సేవలు అభినందనీయం : మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి

ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహిస్తున్న రోటరీ సేవలు అభినందనీయం : మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి

519
0

చీరాల ; ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచటానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని చీరాల మునిసిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి పేర్కోన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి ఆధ్వర్యంలో గురువారం పేరాల ఏఆర్ఎం ఉన్నత పాఠశాలకు మైక్ సెట్ ను ఉచితంగా అందజేశారు. ఈకార్యక్రమానికి హజరైన కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయిలో వసతులు ఉంటున్నాయన్నాయని తెలిపారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారన్నారు. 10 కి 10 వచ్చిన విద్యార్థులకు రూ.10000 నగదు ప్రకటించిన కమిషనర్ రామచంద్రరెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ క్షిరపురి అధ్యక్ష, కార్యదర్శులు అర్వి రమణ, తాడివలస దేవరాజు మాట్లాడుతూ తమ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించేందుకు క్రషిచేస్తున్నామన్నారు.

ఇందులో బాగంగా పాఠశాలకు, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మైక్ సెట్ అందజేయడం జరిగిందన్నారు. దీనితో పాటు పేద విద్యార్థులకు తమ వంతు సాయం అందజేస్తామన్నారు. ప్రధానోపాధ్యాయులు సాల్మన్ రాజు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ క్షీరపురి సేవలను కొనియాడారు. తమ పాఠశాలకు ఇచ్చిన మైకు ఎంతో ఉపయోగపడు తుందన్నారు. ప్రార్థన సమయంలో, ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు మైకు లేక ఇబ్బంది పడుతున్నామని ఇపుడు ఆసమస్య తీరుతుందన్నారు. తమ పాఠశాల పూర్వ విద్యార్థి దేవరాజు ఉన్నత స్థానానికి ఎదగడమే కాకుండా పాఠశాల అభివృద్ధికి ఎంతో చేయూతనిస్తున్నాడని అన్నారు. ప్రతి విద్యార్థి దేవరాజును ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు ఆళ్లగడ్డ మల్లికార్జున్, నాగమల్లేశ్వరరావు, భానుచంద్ర, రాజేంద్ర, ఉపాధ్యాయులు గాంధీ, రమణ పాల్గోన్నారు.