Home సినిమా నేను మీ ముందర ఎలా కనిపిస్తానో, నా నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాను’: రణ్వీర్...

నేను మీ ముందర ఎలా కనిపిస్తానో, నా నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాను’: రణ్వీర్ సింగ్

420
0

హిందీ నటుడు రణ్వీర్ సింగ్ పేరు వింటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆయన చలాకితనం, ఉత్సాహం, విభిన్న వస్త్ర ధారణ. సినిమా ప్రచార వేదికల్లో కాకుండా రణ్వీర్ సింగ్ తెర వెనుక ఎలా ప్రవర్తిస్తాడో అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు చాలానే ప్రయత్నించారు. ఊహ గానాలు కూడా నడిపించారు. కానీ నేను ప్రజల ముందర ఎప్పుడూ నా నిజ స్వభావాన్నే ప్రదర్శించటానికి ప్రయత్నించానని చెప్పుకొచ్చారు రణ్వీర్ సింగ్.

“నాది భిన్న తరహా మనస్తత్వం అని నాకు తెలుసు. నేనెప్పుడూ ఆ విషయాన్నీ దాచే ప్రయత్నం కూడా చేయలేదు. నేనందరి లాగా ప్రవర్తించనని ఎవరన్నా నాతో అంటే నేను చిన్నతనం నుంచి అలానే ఉన్నాను. ఇకపై కూడా ఉంటానని చెబుతాను. నేనెప్పుడూ ఇంతే. నాకు మారాలనే ఉద్దేశం కూడా లేదు. నన్ను నాలాగా, నిష్కల్మషమైన దృష్టితో చూసేవాళ్ళు నా చిన్న నాటి మిత్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే. వాళ్ళకే తెలుసు నా చేష్టలు, అలవాట్లు, వైఖరి ఏదో నిన్నో, మొన్నో పుట్టుకొచ్చినవి కావని,” అంటూ రణ్వీర్ వివరించాడు.

తన గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుతూ “నాకు గుర్తున్నంత వరకు నా వస్త్రధారణ ఎప్పుడూ వ్యత్యాసంగానే ఉంటూ వచ్చింది. మూడో తరగతి లోనే నేను మోహాక్ హెయిర్ స్టైల్ ట్రై చేశాను. ఆ ఫోటోను ఇటీవలే సోషల్ మీడియాలో కూడా పెట్టాను. ఇలాంటి ఫోటోలు నా దెగ్గర కోకోల్లలు ఉన్నాయి. నా విచిత్ర వైఖరిని రుజువు చేస్తాయి. ఈ ఫోటోలు కానీ జనాలు చూస్తే నా అలవాట్లు, అలోచనా తీరుని ఇంకా మెరుగ్గా గ్రహిస్తారు. నేనేదో కొత్తగా ఉండటానికి, నటించడానికి ప్రయత్నించట్లేదు. నేనేంటో జనాలకి చెబుతున్నానంతే. ఇదేదో ఒక వ్యూహం ప్రకారంగా చెయ్యట్లేదు. పైగా, జనాల దృష్టిని నా పై మళ్లించడానికి నేను ఇలా చేస్తున్నానే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. పరుల స్వభావం గురించి నేనెప్పుడూ విమర్శించను. అలాగే నా అలవాట్లు, పద్ధతుల గురించి కూడా అనవసర విమర్శలు వినదలుచుకోలేదు. కాలం పోయే కొద్దీ ఈ విషయాలు అందరూ అర్ధం చేసుకుంటారని భావిస్తాను. నన్ను నా లాగానే ఇష్టపడతారని ఆశిస్తాను,” అని రణ్వీర్ పేర్కొన్నాడు.6