ఆధ్యాత్మికం : వినాయక చవితి సంధర్భంగా వాడ వాడలా గణనాధునికి విశేష పూజలు చేశారు. వీధి, వీడినా పందిళ్లు వేశారు. ఎవరికి వారు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవిధంగా విగ్రహాలను అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణలో పూజలు చేశారు. పందిళ్ల వద్ద విద్యుత్ దీపాలతో అలంకరించారు. గణపయ్యకు ఇష్టమైన వంటలు చేసి నైవేద్యం పెట్టారు. లడ్డు, ప్రాసాదంను స్వామివారికి సమర్పించారు. పూలు, పత్రాలతో గణనాధునికి పూజలు చేశారు.