Home క్రైమ్ ప్రియునితో… సహజీవనానికి అడ్డొస్తోందని… నాలుగేళ్ల చిన్నారిపై త‌ల్లే… హింస‌లు

ప్రియునితో… సహజీవనానికి అడ్డొస్తోందని… నాలుగేళ్ల చిన్నారిపై త‌ల్లే… హింస‌లు

501
0

హైదరాబాద్ : భ‌ర్త‌తో వివాద‌మొచ్చింది. విడాకులు కోరింది. వేరుగా కాపురం పెట్టింది. ఈ క్ర‌మంలో ఓ డిసిఎం డ్రైవ‌ర్‌తో ప‌రిచ‌యం పెట్టుకుంది. వారిద్ద‌రి ఏకాంతానికి బ‌ర్త‌తో క‌న్న బిడ్డ అడ్డొచ్చింది. అంతే ప్రియునితోపాటు త‌ల్లీ తోడైంది. నాలుగేళ్ల ఆ చిన్నారిని చిత్ర హింస‌లు పెట్టారు. కొట్టారు. వంటిపై గాయాలు అయ్యాయి. నోటితో కొరికారు. అయినా ఆ చిట్టిత‌ల్లి ఏమీ తెలుసు త‌ల్లే క‌దా? అనుకుంది. ఎన్ని హిస‌లు పెట్టినా త‌ల్లిని వీడ‌లేదు. వాళ్లు పెట్టే హింస‌ల‌కు చిన్నారి ఏడుపులు, చివ‌రికి కొట్టిన దెబ్బ‌ల‌కు చెయ్యి విరిగింది. అంతే చిన్నారిని పెడుతున్న హిస‌లు చూడ‌లేని ఇరుగు పొరుగు జోక్యం చేసుకోవడంతో విష‌యం వెలుగు చూసింది.

న‌ల్గొండ జిల్లా ముకునూరు గ్రామానికి చెందిన స‌రిత‌కు ఆరేళ్ల క్రితం వెంక‌న్న అనే వ్య‌క్తితో వివాహం చేశారు. వీరికి రేణుక (4) నాలుగేళ్ల కూతురు ఉంది. భార్య భ‌ర్త‌ల మ‌ద్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. చివ‌రికి విడాకుల వ‌ర‌కు వెళ్లింది. కోర్టును ఆశ్ర‌యించారు. ఇద్ద‌రూ వేరుగా ఉంటున్నారు. కోర్టును ఆశ్ర‌యించిన‌ప్ప‌టి నుండి స‌రిత ముసారాబాద్‌లోని తూర్పు ప్ర‌శాంత్‌న‌గ‌ర్‌లోని అపార్టుమెంట్‌లో కూతురు రేణుక‌(4)తో క‌లిసి ఉంటుంది. అదే స‌మ‌యంలో డిసిఎం డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే వెంక‌ట‌రెడ్డితో ప‌రిచ‌యం ఏర్పడింది. వీరి ప‌రిచయ‌డం వివాహేత‌ర సంబంధానికి దారితీసింది. వీరిద్ద‌రి ఏకాంతానికి క‌న్న‌బిడ్డ అడ్డుగా ఉంద‌ని భావించి చిత్ర‌హింస‌లు పెట్ట‌డం మొద‌లు పెట్టారు. ప్రియునితో క‌లిసి కొట్ట‌డంతో పాప‌కు చేయి విరిగింది. అయిన‌ప్ప‌టికీ త‌ల్లిని వ‌ద‌ల‌క‌పోవ‌డంతో ప్రియుడు నోటితో కొరికాడు. చేతికి ర‌క్త‌గాయ‌మైంది. ఇరుగు పొరుగు జోక్యం చేసుకుని ఎందుకు కొడుతున్నార‌ని ప్ర‌శ్నించారు. చెప్పిన మాట విన‌లేద‌ని స‌మాధానం చెప్పారు. చిత్ర‌హింస‌లు పెర‌గ‌డంతో మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి దృష్ట‌కి తీసుకెళ్లారు. ఆయ‌న బాలల హక్కుల సంఘం ద్వారా బాలికను చేరదీశారు. బాల‌ల హ‌క్కుల సంఘః అధ్య‌క్షుడు అచ్చుత‌రావు బాలిక‌ను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. బాలిక‌ తల్లిని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. ప్రియుడు మాత్రం ప‌రార‌య్యాడు. అత‌ని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మ‌లక్‌పేట పోలీసులు స‌రిత‌, ఆమె ప్రియుడు వెంక‌ట‌రెడ్డిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.