Home జాతీయం రాజస్థాన్ సంచలనం 4శాతం వ్యాట్, కేరళ లీటర్ కు రూ.9తగ్గింపు

రాజస్థాన్ సంచలనం 4శాతం వ్యాట్, కేరళ లీటర్ కు రూ.9తగ్గింపు

453
0

అమరావతి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు మార్కెట్ కు వదిలేసింది. ఫలితంగా కూరగాయల మార్కెట్ తరహాలో పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బిజెపి అధికారానికి వచ్చే నాటికి అంతర్జాతీయ మార్కెట్లో బారల్ ముడి సమురు 110డాలర్లు ఉన్నది. అప్పుడు మనదేశంలో పెట్రోల్ లీటర్ రూ.74ఉన్నది. ఇప్పుడు బారల్ ముడిసమురు 78దాలర్లకు తగ్గింది. కానీ మన దేశంలో పెట్రోల్ లీటర్ రూ.85దాటింది.

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలను నిరసనగా ప్రతిపక్ష పార్టీలన్నీ భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. జనం స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. రోడ్లు దిగ్బంధం చేశారు. ప్రభుత్వం తీరును తూర్పారబడుతున్నారు.

ప్రజాగ్రహానికి దిగొచ్చిన రాజస్థాన్ లోని బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజీలపై 4శాతం వ్యాట్ తగ్గించుకుంది. గతంలో 30శాతం పెట్రోల్పై, 22శాతం డీజీలపై వ్యాట్ ఉండేది. తాజా నిర్ణయంతో పెట్రోల్పై 26శాతం, డీజీలపై 18శాతానికి వ్యాట్ టాక్స్ తగ్గించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పై రూ.2వేల కోట్ల భారం పడనుంది రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. బిజెపికి దేశప్రజాలంతా సమానంగా కనిపించడంలేదు అనేందుకు ఇదే నిదర్శనం.

కేరళ వామపక్ష ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పన్నులను తగ్గించి ప్రజలకు ఉప శమనం పల్పించారు.