Home క్రైమ్ యువ‌కుని హ‌త్య‌కు దారితీసిన‌ వివాహేత‌ర సంబంధం…

యువ‌కుని హ‌త్య‌కు దారితీసిన‌ వివాహేత‌ర సంబంధం…

391
0

చిలకలూరిపేట(గుంటూరు) : వివాహేతర సంబంధం ఓ యువ‌కుని హ‌త్య‌కు దారితీసింది. ప్ర‌కాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లికి చెందిన నూతలపాటి అంజనీరాజు(25) చిల‌క‌లూరిపేట మండ‌లం య‌డ‌వ‌ల్లి స‌మీపంలో హత్యకు గుర‌య్యాడు. చిలకలూరిపేట రూరల్‌ సీఐ శోభన్‌బాబు చెప్పిన‌ వివరాల ప్రకారం గురిజేపల్లికి చెందిన అంజనీరాజు రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. భార్య‌తోపాటు చిల‌క‌లూరిపేట‌లోని సుభానిన‌గ‌ర్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే క్వారీ మిషన్‌ ఆపరేటర్‌గా పనిచేసేందుకు ప్ర‌తిరోజూ య‌డ‌వ‌ల్లి వ‌స్తుంటాడు.

రోజుటిలాగే మంగళవారం అర్థరాత్రి సమయంలో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై చిలకలూరిపేటకు బ‌య‌లుదేరాడు. మార్గ‌మ‌ద్య‌లో యడవల్లి శివారున దుండగులు అంజనీరాజుపై మారణాయుధాలు, బండరాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. సమాచారం అందుకున్నన్న వెంట‌నే ఎస్‌ఐ ఉదయ్‌బాబుతో క‌లిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అంజనీరాజు గతంలో తనకు అన్నయ్య వరుసయ్యే వ్యక్తి భార్యతో వివాహేత‌ర‌ సంబంధం పెట్టుకున్నాడు. ఈ అంశంపై గతంలో బంధువుల మధ్య గొడవలు జరిగాయి. పెద్దలు సర్దిచెప్పారు. అయినా వినకుండా సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలో హత్య జ‌రిగి ఉంటుంద‌ని మృతుని సోదరుడు నూతలపాటి హరికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.