Home గుంటూరు మ‌హిళ‌లు ఆర్ధికంగా అభివృద్ది చెందాల‌నే పొదుపు సంఘాల ఏర్పాటు

మ‌హిళ‌లు ఆర్ధికంగా అభివృద్ది చెందాల‌నే పొదుపు సంఘాల ఏర్పాటు

502
0

బాపట్ల : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ల‌క్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా డ్వ‌క్రా పొదుపు ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టార‌ని ఎంఎల్‌సి, టిడిపి బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి అన్నం స‌తీష్‌ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు. మ‌హిళ‌ల ఆర్ధికాభివృద్దికోస‌మే పొదుపు సంఘాల‌కు రాయితీతో త‌క్కువ వ‌డ్డీపై రుణ స‌దుపాయం క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. అధికారుల సహ‌కారంతో రుణాలు అంద‌జేస్తున్న‌ట్లు చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లో శ్రీనిధి రుణాలు, ఉన్నతి లోన్స్, బ్యాంక్ రుణాలను అందిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను మ‌హిళ‌ల‌కు చేరువ చేయ‌డంలో త‌న‌వంతు కృషి చేస్తాన‌ని చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గంలో గ‌డిచిన నాలుగేళ్ల‌లో ఇప్ప‌టి ర‌కు మ‌హిళ‌ల అభివృద్దికి చేపట్టిన కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు.

మ‌హిళాభ్యున్న‌తికి 256పొదుపు సంఘాల‌కు రూ.77కోట్ల రుణాలు ఇచ్చామ‌ని తెలిపారు. 1575పొదుపు సంఘాల‌కు రూ.96.36కోట్ల బ్యాంకు రుణాలు ఇప్పించామ‌న్నారు. స్ర్తీనిధి ద్వారా రూ.17.17కోట్ల రుణాలు ఇచ్చార‌ని తెలిపారు. పిట్ట‌ల‌వారిపాలెం మండ‌లంలో 2014-18మ‌ద్య కాలంలో 732పొదుపు సంఘాల‌కు రూ.25.58కోట్ల రుణాలు ఇచ్చార‌ని వివ‌రించారు. స్ర్తీనిధి ద్వారా 468పొదుపు సంఘాల‌కు రూ.5.10కోట్ల రుణాలు ఇచ్చార‌ని తెలిపారు. ఉన్న‌తి ప‌థ‌కం ద్వారా 75పొదుపు సంఘాల‌కు రూ.36.25ల‌క్ష‌ల రుణం ఇచ్చార‌ని తెలిపారు. క‌ర్ల‌పాలెం మండ‌లంలో 1107పొదుపు సంఘాల‌కు రూ.47.79కోట్ల రుణాలు ఇచ్చామ‌న్నారు. 878పొదుపు సంఘాల స్ర్తీనిధి నుండి రూ.10.11కోట్ల రుణాలు, ఉన్న‌తి ప‌థ‌కం ద్వారా 184పొదుపు సంఘాల‌కు రూ.16.77ల‌క్ష‌ల రుణం ఇచ్చిన‌ట్లు తెలిపారు.