శింగరాయకొండ : సాధారణంగా వాహనాలపై వెళ్లేటప్పుడు మనం ముందు చూసుకుని వెళుతుంటాం. కానీ వెనుక నుండి వచ్చే ప్రమాదం గుర్తించడం ఎలా? సాధ్యమా? మనమొక్కరిమే జాగ్రత్తగా వెళ్లడం కాదు. వెనకా, ముందు వాళ్లు కూడా జాగ్రత్తలు వహిస్తేనే ప్రయాణం సుఖం, సురక్షితంగా గమ్యం చేరగలమనేందుకు ఈ ప్రమాదం ఉదాహరణ.
శింగరాయకొండ – పాకల రొడ్డులోని గ్యాస్ గోడౌన్ వద్ద జరిగిన ప్రమాదం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒకింత జాతీయ రహారిపై ఎంత ప్రమాదమో చెబుతుంది. ఉలవపాడుకు చెందిన పి ప్రదీప్ స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఒంగోలులోని కరెన్సీ చెక్ విభాగంలో ఆంద్రాబ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం ఉలవపాడు నుండి సింగరాయకొండ వచ్చి మరల ఒంగోలు వెళ్తున్నాడు. అతనికి గ్యాస్ గూడౌన్ వద్ద వెళ్లేసరికి అతని జేబులోని ఫోన్ మోగింది. బైక్‌ను రోడ్డు పక్కన అపుకొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో అతని వెనుక నుంచి పెద్ద క్రేన్ వచ్చింది. క్రేన్ అపేరటర్ నిర్లక్ష్యంగా నడిపి ప్రదీప్‌ను గుద్దాడు. అంతే అతనికి ఎడమకాలు తొడ ఎముక విరిగి పోయినదిజ సకాలంలో స్పందించిన సి ఐ పి దేవప్రభాకర్ వెంటనే 108అంబులెన్స్‌ను పిలిపించి సింగరాయకొండ హెడ్ కానిస్టేబుల్ ఖాసింను తోడుచేసి క్షతగాత్రుడైన స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్ ప్రదీప్‌ను ఒంగోలు నల్లూరి నర్సింగ్ హోమ్‌కు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.