చీరాల : ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో టిడిపి, బిజెపి, కాంగ్రెస్, వైసీపీకి ప్రత్యామ్నాయంగా కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలతో రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, సిపిఐ కార్యదర్శి మేడా వెంకటరావు తెలిపారు. కలిసి వచ్చే పార్టీలు, సంస్థలతో జులై 22న ఒంగోలులో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి గంగయ్య, కందుకూరి ఎల్లమంద, డాకా నారపరెడ్డి పాల్గొన్నారు.