Home ఆంధ్రప్రదేశ్ ఐటి రంగంలో 3లక్షల ఉద్యోగావకాశాలు : మంత్రి లోకేష్

ఐటి రంగంలో 3లక్షల ఉద్యోగావకాశాలు : మంత్రి లోకేష్

469
0

చీరాల : రాష్ట్రంలో3లక్షల మందికి ఐటి రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికిచర్యలు తీసుకున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం కొత్తపేట జిల్లా పర్షిత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు, పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటి కంపెనీలు స్థాపించడానికి కియో మోటార్స్, హే.సి.ఎల్.కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ప్రతి నెల రూ.1000 ఇవ్వడానికి బడ్జెట్ లో రూ.1200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 50లక్షల పెన్షన్లు ఇస్తే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ లో 50లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. కేంద్రం ప్రభుత్వం సహకరించక పోయినప్పుటికి, లోటు బడ్జెట్ అయినప్పటికీ రూ.24వేల కోట్లతో రైతురుణమాఫీ అమలు చేశామన్నారు. రాష్ట్రంలో25 వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్డులు నిర్మిచడానికి చర్యలు తీసుకున్నామన్నారు.

గడిచిన 4 సంవత్సరాల్లో 17 వేల కిలోమీటర్లు సిమెంటు రోడ్డులు నిర్మించామన్నారు. రాబోయే సంవత్సరం లో8 వేల కిలో మీటర్లు సిమెంటు రోడ్డులు నిర్మిస్తా మన్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో అంగన్ వాడి భవనాలు, పంచాయతీ బిల్డింగ్స్, ప్రతి ఇంటికి త్రాగు నీటి కుళ్లాయి, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఎల్.ఈ.డీ. బల్బ్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రకాశం జిల్లాలో త్రాగునీటి సౌకర్యాలు కల్పించడానికి వాటర్ గ్రిడ్ పథకం కింద రూ.2900 కోట్ల నిధులు కేటాయించడము జరిగిందని తెలిపారు. చీరాల నియోజకవర్గ పరిధిలో తారు రోడ్లు నిర్మాణం కోసం రూ.10 కోట్లు మంజూరు చేశా మన్నారు.

చీరాల నియోజకవర్గ పరిధిలోని 24 గ్రామ పంచాయతీల్లో రోడ్డులు పూర్తి చేయాడానికి రూ.72 కోట్ల నిధులు అవసరమని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కోరారని, దశల వారీగా అన్ని రోడ్డులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన అన్నారు. భారతీదేశంలో ఆంధ్రప్రదేశ్ ను రెండు అంకెల అభివృద్ధి లో నిలిపారన్నారు. రాష్ట్రంలో 40 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని ముఖ్యమంత్రి 4 సంవత్సరాలల్లో చేసి చూపారన్నారు. రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ.3500 కోట్లతో సిమెంటు రోడ్డులు నిర్మించడాని మంత్రి చర్యలు చేపట్టారన్నారు .. రాష్ర్టంలో పంచాయతీ రాజ్, ఐటి మంత్రి గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐటి రంగంలో విప్లవాత్మక మైన మార్పులు తీసుకువచ్చారన్నారు.

ప్రభుత్వ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని అన్నారు. సభలో పాల్గొన్న రాష్ట్ర మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖా మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రైతుల సమస్యలపై తక్షణమే స్పందించాలని అయన అన్నారు. రాష్ట్రంలో రైతులను ఆదుకోవడానికి మార్కెట్ ఇంట్రవెన్షన్ పధకం క్రింద రూ.500 కోట్ల నిధులు ఉన్నాయన్నారు. రైతులు పండించిన కందులు, శనగలకు గిట్టుబాటు ధరలు లేనప్పుడు ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి వాటిని కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గ పరిధిలో స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.10.35 కోట్ల విలువైన చెక్కును మంత్రి అందజేశారు.

అనంతరం కొత్తపేట జిల్లా పర్షిత్ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మంత్రి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలో అవసరమైన సౌకర్యాల గురించి మంత్రి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల శాసన సభ్యులు శ్రీ ఆమంచి కృష్ణ మోహన్, ఒంగోలు ఎమ్మెల్యే దామాచర్ల జనార్దన్ రావు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమాల అశోక్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబు రావు, వైపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, జిల్లా కలెక్టర్ శ్రీ వీ.వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.