Home ఆంధ్రప్రదేశ్ సెయింట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ బి.టెక్‌ (డేటా సైన్స్‌) విద్యార్ధులకు వీడ్కోలు

సెయింట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ బి.టెక్‌ (డేటా సైన్స్‌) విద్యార్ధులకు వీడ్కోలు

23
0

చీరాల : సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ అఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజి బిటెక్‌ (డేటా సైన్స్‌ విభాగము) ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులకు డేటా సైన్స్‌ విభాగ విద్యార్ధులు వీడ్కోలు సభ (స్పెక్ట్రోమిక్‌ ` 2కె25) నిర్వహించినట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణా రావు, కరస్పాండెంట్‌ ఎస్‌ లక్ష్మణరావు తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్ కె జగదీశ్‌ బాబు మాట్లాడుతూ విద్యార్ధులు పట్టుదలతో కృషి చేసి ఉన్నత స్ధాయిలో స్దిరపడాలని ఆకాంక్షించారు. డేటా సైన్స్‌ విభాగాధిపతి డాక్టర్ కె సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్ధులు కృషి, పట్టుదల, క్రమశిక్షణతో కెరియర్‌లో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా డేటా సైన్స్‌ విభాగం మూడవ సంవత్సరం విధ్యార్ధులు ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులకు జ్ఞాపికలను అందజేశారు. ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు తమ సందేశాలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. కార్యక్రమంలో డైరక్టర్‌ (అక్రిడిటేషన్స్‌) డాక్టర్ సిఎస్‌ రావు, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ ఆర్‌వి రమణమూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.