Home ఆంధ్రప్రదేశ్ పోలీస్ అయ్యి ప్రజల్ని రక్షించాలి

పోలీస్ అయ్యి ప్రజల్ని రక్షించాలి

23
0

చిన్నగంజాం : కొత్తగొల్లపాలెంలో మానసిక దివ్యాంగురాలైన వడ్లమూడి సుభాషిణి ఇంటికి పింఛను అందించేందుకు సీఎం చంద్రబాబు వెళ్లారు. సుభాషిణి కుటుంబానికి ఇల్లు మంజూరు చేయడంతో పాటు ఆమె తల్లికి ఒంటరి మహిళ పెన్షన్ మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుభాషిణి చెల్లెలు భరణిని ఏం చదువు కుంటున్నావ్, ఏం కావాలను కుంటున్నావని సీఎం అడిగారు. భరణి సమాధానం ఇస్తూ.. తనకు పోలీస్ అవ్వాలని ఉందని చెప్పింది. జనాల్ని బాగా కొట్టొచ్చు అని పోలీస్ అవుదామ నుకుంటున్నావా అని నవ్వుతూ అన్నారు. పోలీస్ అయ్యి ప్రజల్ని కాపాడాలని సీఎం సూచించారు. చదివించు కునేందుకు ఇబ్బంది పడుతున్నామని, కుటుంబ సభ్యులు తెలపగా ఆమెను కస్తూర్బా గాంధీ పాఠశాలలో చేర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇష్టపడి చదువుకోవాలి : మరో లబ్ధిదారు బత్తుల జాలమ్మ గృహానికి వెళ్లి వితంతు పెన్షన్ పంపిణీ చేశారు. జాలమ్మ ఇల్లు శిథిలావస్థకు చేరడంతో చూసి చలించిపోయిన సీఎం వెంటనే గృహాన్ని మంజూరు చేయడంతో పాటు గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వాలని ఆదేశించారు. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కు నేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఏం చదవు కుంటున్నావని జాలమ్మ చిన్నకుమారుడుని ప్రశ్నించగా పదవ తరగతి మధ్యలో నిలిపేశానని చెప్పారు. చదువుకుంటావా అని సీఎం అడగ్గా చదువు రాదని అతను తిరిగి సమాధానం ఇచ్చాడు. ఎందుకు రాదు, మేమంతా వచ్చి చదువుకున్నామా, ఇష్టపడి చదవుకున్నామని అన్నారు. చదవు రాదని మనసులో పడితే రాదని, వస్తుందంటే వస్తుందని అన్నారు. ఎప్పుడూ గొర్రెలు మేపడమే కాదు, పై స్థాయికి రావాలని సీఎం చంద్రబాబు సూచించారు.