Home బాపట్ల పర్చూరు నియోజకవర్గానికి సీఎం వరాలు

పర్చూరు నియోజకవర్గానికి సీఎం వరాలు

16
0

పర్చూరు : నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును మనస్పూర్తిగా అభినందిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు షిప్ బిల్డింగ్, షిప్ రిపేరింగ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని సీఎం చెప్పారు. అలాగే నాగార్జున సాగర్ కాలువ ఆధునీకరణ పనులు, నూతన ఎన్సీపీ కార్యాలయం, షాదీఖానాలు, దర్గాల ఆధునీకరణ పనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కమ్యూనిటీ భవనాల నిర్మాణం, బీసీ, ఓసీలకు శ్మశాన వాటికల నిర్మాణం, రూ.9 కోట్ల 10 లక్షల వ్యయంతో జాతీయ రహదారి నుంచి వలపర్ల ఇండస్ట్రియల్ పార్క్ కు డబుల్ రోడ్డు, వలపర్ల గ్రామంలో వాటర్ స్టోరేజ్ ట్యాంక్, ఇంకొల్లు-మార్టూరు-పర్చూరులో ఆటోనగర్ ఏర్పాటుకు అనుమతులు, కొమ్మూరు కాలువ భూ సేకరణకు రూ.5కోట్లు మంజూరు, పర్చూరు- కారంచేడు- ఇంకొల్లు- చినగంజాంలో మూడు వ్యవసాయ మార్కెట్లు, ఇంకొల్లులో డ్రైనేజ్ సమస్య పరిష్కారం సహా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పేదల వైద్యానికి ఆర్థిక సాయం వంటి అన్ని పనులకు ప్రభుత్వం నుంచి వెంటనే నిధులు మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

మార్గదర్శులకు సీఎం అభినందన : పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చిన విక్రమ్ నారాయణరావు, వసంత శ్రీనివాసరావును సీఎం చంద్రబాబు అభినందించారు. దాతలిద్దరూ చెరో 15 కుటుంబాలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకోనున్నారు.