Home బాపట్ల ఎన్నికల నిబంధనలు ఉల్లంగిస్తున్న కూటమి అభ్యర్ధి

ఎన్నికల నిబంధనలు ఉల్లంగిస్తున్న కూటమి అభ్యర్ధి

54
0

బాపట్ల : ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టబద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తరఫున జిల్లాలోని వివిధ మండలాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని, పీడిఎఫ్ అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొంటున్న వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య జిల్లా కలెక్టర్‌ జె వెంకట మురళికి మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో పిర్యాదు చేశారు. ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఆయన వెంట సిపిఎం జిల్లా నాయకులు సిహెచ్‌ మజుందార్‌, ఎం వసంతరావు ఉన్నారు.