గుంటూరు : స్వచ్ఛభారత్ పితామహుడు ఘాట్కే బాబా 149వ జయంతి సందర్భంగా గుంటూరు నగరంలోని సాయిబాబా రోడ్డులో తుమ్మలపూడి శ్రీధర్ ఆధ్వర్యంలో గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి, రజక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రాచకొండ నాగేశ్వరరావు, విద్యాసంస్థల అధినేత బి శ్రీనివాసరావు, రజక వెల్ఫేరు డెవలప్మెంట్ కార్పొరేషన్ మరొక డైరెక్టర్ ఎన్‌సి పరమేశ్వర్, జాతీయ బిసి బహుజన ఫ్రెండు, నాయి బ్రాహ్మణ జెఎసి రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు పాల్గొన్నారు. సభ అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవికి ప్రజా ఉద్యమ నాయకులు జననాయక కర్పూరి ఠాకూర్ అవార్డు గ్రహీత తాటికొండ నరసింహారావుకు సన్మానం చేశారు.