విజయవాడ : స్థానిక పున్నమి ఘాట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వివాహ వేదిక పరిచయం, రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. రిటైర్డ్ ఎస్పి రవీంద్రబాబు, డిప్యూటీ కలెక్టర్ ఎం శ్రీనివాస్, చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడారు. అందరూ ఐక్యంగా ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందిస్తూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని కోరారు.
రాష్ట్ర సంక్షేమ సంఘానికి బాపట్ల జిల్లా నుండి అధ్యక్షులుగా డాక్టర్ తాడివలస దేవరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా భానవరపు శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శిగా నూతలపాడు గ్రామానికి చెందిన కలవకురి బసవేశ్వరరావును రాష్ట్ర అధ్యక్షులు మార్కాపురం కనకారావు నియమించారు. వివాహ పరిచయ వేదికలో 700 మందిపైగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు బ్రహ్మయ్య, కనుపర్తి జానకిరావు , తూళ్లురి సూరిబాబు, కొమ్మవరపు భానుప్రసాద్, ఎం నాగరాజు, కనుమలు సురేష్, భట్టిబ్రోలు శ్రీనివాస్, కాశీ, రామాంజనేయులు పాల్గొన్నారు.