Home బాపట్ల రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం : న్యూజిలాండ్ సభలో ఎమ్మెల్యే ఏలూరి

రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం : న్యూజిలాండ్ సభలో ఎమ్మెల్యే ఏలూరి

20
0

పర్చూరు (Parchuru) : తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశమని శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు (Yeluri Sambashivarao) పేర్కొన్నారు. ఎన్నారై న్యూజిలాండ్ తెలుగుదేశం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మతో (Vegeshana Narendra Varma) కలిసి ఆయన ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎన్‌టిఆర్‌ (NTR) తెలుగుదేశంను (Telugudesham) స్థాపించారని అన్నారు.

తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో పార్టీని స్థాపించిన ఆయన ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం నినాదంతో ప్రజల గుండెల్లో పార్టీని నింపారన్నారు. ప్రజా సంక్షేమం, ప్రజల కష్టాలు తీర్చడం కోసం తెలుగుదేశం నిరంతరం పనిచేస్తుందన్నారు. తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగుదేశం ఉంటుందన్నారు.

గత ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అఖండ విజయం సాధించిందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు తెలుగుదేశంకు పట్టం కట్టారని గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అదొగతి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో ఉంటే తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి స్వలాభం కోసం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని అన్నారు.

దేశ చరిత్రలో లేని విధంగా జగన్ మోహన్ రెడ్డి పాలనలో అన్ని రంగాలు ధ్వంసం అయ్యాయన్నారు. చంద్రబాబు హయాంలో ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలపడమే చంద్రబాబు లక్ష్యమన్నారు.

విదేశాల్లో ఉంటూ రాష్ట్రానికి మంచి జరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్న అందరికీ అభినందనలు అన్నారు. ఏమి ఆశించకుండా రాష్ట్ర భవిష్యత్తుకు, ప్రజల అభ్యున్నతికి పాటుపడడం ఆదర్శం అన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిన సమయంలో ప్రజలను చైతన్యం చేయడంలో ప్రవాసాంద్రుల పాత్ర అమోఘం అన్నారు. చంద్రబాబును అక్రమంగా జైల్లో నిర్బంధించినప్పుడు 100 దేశాల్లో నిరసనలు చేపట్టారని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో న్యూజిలాండ్‌లో సైతం నిరసన తెలిపి మద్దతు ఇవ్వడం మర్చిపోలేనిదని అన్నారు.

తెలుగుదేశం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మద్దుకూరు దిలీప్, ప్రతాపరెడ్డి, మజీద్, సామ్యూల్, జితేంద్ర, నిమ్మగడ్డ మమత పాల్గొన్నారు.