Home బాపట్ల మేరుగ నాగార్జునకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం వల్ల వైసిపికే నష్టం జడ రవీంద్ర

మేరుగ నాగార్జునకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం వల్ల వైసిపికే నష్టం జడ రవీంద్ర

54
0

బాపట్ల : వైసిపి జిల్లా అధ్యక్షులుగా మాజీ మంత్రి మెరుగు నాగార్జునను నియమించటం జిల్లాకు నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని వైసీపీ నాయకులు జడ రవీంద్ర ఆరోపించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు ఆయువునందిస్తూ కుల, మతాలకు అతీతంగా, పార్టీలకతీతంగా సేవలందించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలనకు ఆకర్షితుడనై గత సార్వత్రిక ఎన్నికల ముందు వైసిపి తీర్థం పుచ్చుకొని పార్టీకు తన శాయి శక్తులా కృషి చేశానని చెప్పుకునే మాజీ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అక్రమాలు ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. ఇసుక దోపిడి, అక్రమాలకు పాల్పడి కోట్లు దనుకున్నారే తప్ప నియోజవర్గానికి చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. అలాంటి వ్యక్తిని మళ్లీ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం వల్ల నష్టమే తప్ప పార్టీకి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. దీని దృష్ట్యా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రెండు దశాబ్దాలుగా నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు, అణగారిన వర్గాలకు నాగార్జున చేసిందేమిలేదని అగ్రహారం వ్యక్తం చేశారు. నాగార్జున సొంత నియోజకవర్గం, సొంత గ్రామానికి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని అన్నారు. ఆటువంటి వ్యక్తికి జిల్లా అధ్యక్షత పదవి ఇవ్వడం హాస్యస్పదంగా ఉందన్నారు. దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలియలేధని అన్నారు. కాబట్టే వైసిపి నుండి బయటికి వెళ్ళిపోతున్నట్లు ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టపడే నాయకులను ఇకనైనా గుర్తించాలని కోరారు. 2029లో మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంతున్నట్లు తెలిపారు.