చీరాల : వ్యాయామ ఉపాధ్యాయులు సుందరరామిరెడ్డి హాకీ క్రీడకు చేసిన సేవలు ఎనలేనివని ఆంధ్రప్రదేశ్ హాకీ ఫెడరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం నిరంజన్‌రెడ్డి అన్నారు. స్థానిక గోలి సదాశివరావు కళ్యాణ మంటపంలో ఆదివారం జరిగిన ఆళ్ల సుందర రామిరెడ్డి ఉద్యోగ విరమణ సన్మాన సభలో ఆయన మాట్లాడారు. పూర్వపు ప్రకాశం జిల్లాలో హాకీ క్రీడలో జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసిన ఘనత సుందరరామిరెడ్డిదేనని అన్నారు. వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు వై శీనయ్య మాట్లాడుతూ వేసవి హాకీ శిక్షణా శిబిరాలు నిర్వహించడంలో విశేష కృషి చేశారని అన్నారు. 34ఏళ్లుగా వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేసి చీరాల ప్రాంతంలో మంచి పేరు పొందారని అన్నారు. సుందరరామిరెడ్డి, పద్మావతి దంపతులను వ్యాయామ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయ సిబ్బంది, పూర్వ విద్యార్ధులు, మిత్రులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సుందరరామిరెడ్డి శిష్యులు, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడివలస దేవరాజు, వెంకటేశ్వరరావు, కృష్ణమోహన్, కుర్రా రామారావు
వెలుగొండరెడ్డి, వీరాంజనేయులు, ఏడుకొండలు, పవని భాను చంద్రమూర్తి, ప్రకాష్, ధన, గోల్డి పాల్గొన్నారు.