Home బాపట్ల శాశ్వత స్మశాన వాటిక కోసం జిల్లా కలెక్టర్ కు వినతి

శాశ్వత స్మశాన వాటిక కోసం జిల్లా కలెక్టర్ కు వినతి

79
0

బాపట్ల (Bapatla) : దళిత గిరిజన బడ్జెట్ వాచ్ ఆధ్వర్యంలో బాపట్ల మండలం మూలపాలెం పంచాయతీ గాదె వెంకటరెడ్డి (Gade VenkataReddy)ఎస్టీ కాలనీకి శాశ్వత స్మశాన వాటిక స్థలం కేటాయించాలని కోరుతూ సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ పి రంజిత్ బాషాకు కాలనీ వాసులు వినతి పత్రం అందజేశారు. దళిత కాలనీ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు గుదే రాజారావు, డిబిఆర్సి సిటీ కోఆర్డినేటర్ శ్రీ లత, అభి, అఖిల భారత దళిత గిరిజన జిల్లా అధ్యక్షలు పర్రె కోటయ్య పాల్గొన్నారు.