Home గుంటూరు బేటాపూడిలో క్రీడా పోటీలు

బేటాపూడిలో క్రీడా పోటీలు

677
0

బాపట్ల : బేతపూడి గ్రామంలో నవయుగ సమాఖ్య ఆధ్వర్యంలో ఘనతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు గ్రామ యువకులు, ఉద్యోగస్తులందరూ కలిసి సాంస్కృతిక, విద్యా, క్రీడ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన సభకు నవయుగ సమైక్య బేతపూడి ఉపాధ్యక్షుడు చంద్రారెడ్డి అధ్యక్షత వహించారు. బహుమతుల పంపిణీలో ధృతి ఫౌండేషన్ చైర్మన్, కార్యదర్శి కళ్లెం హరినాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడివలస దేవరాజు, జెడ్ పి హై స్కూల్ హెడ్మాస్టర్ జయ కుమార్, బేతపూడి వైస్ ప్రెసిడెంట్ బ్రహ్మచారి రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మి, బేతపూడి పాఠశాల హెచ్ఎఫ్ శాంతి కుమారి పాల్గొని బహుమతులు అందజేశారు. బేతపూడి గ్రామంలో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న స్వర్ణ బాపూజీకి ఘనంగా సన్మాన నిర్వహించారు. చిన్నారులు దేశభక్తి గీతాలతో నృత్య ప్రదర్శన చేశారు.

ఈ సందర్భంగా కళ్లెం హరినాథ్ రెడ్డి, డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ విద్యతో సమాజంలో మంచి గుర్తింపును పొందవచ్చని, తల్లిదండ్రులు పిల్లలు ఎలా చదువుతున్నారని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. త్వరలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ తరఫున డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య శిబిరాన్ని బేతపూడి గ్రామంలో నిర్వహిస్తామని అన్నారు. నవయుగ సమైక్య ద్వారా బేతపూడి గ్రామంలో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న యువతను, ఉద్యోగస్తులను అభినందించారు. కార్యక్రమంలో సమైక్య నవయుగ సమైక్య, బేతపూడి యువత, ఉద్యోగస్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.