Home గుంటూరు ఏపీజే అబ్దుల్ కలాం కు ఘన నివాళి 

ఏపీజే అబ్దుల్ కలాం కు ఘన నివాళి 

224
0

బాపట్ల : మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా మునిసిపల్ కార్యాలయం ఎదురుగా వున్న అబ్దుల్ కలాం విగ్రహానికి వైయస్సార్సీపీ నాయకులు చల్లా రామయ్య తన టీంతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చల్లా రామయ్య మాట్లాడుతూ ఎంతో పేదరికంలో వుండి అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుని భారతదేశ అణు శాస్త్రవేత్తగా, దేశానికి రాష్ట్రపతిగా దేశానికి దేశప్రజలకు గొప్ప సేవలను అందించిన మహనీయుడు అబ్దుల్ కలాం అని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తిని ప్రతిఒక్కరూ స్మరించుకోవాలన్నారు. గొప్ప ఆశయాలతో జీవితంలో ముందుకు సాగాలన్నారు. ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరారు. భావితరాలకు స్ఫూర్తిగా నిలబడాలని అన్నారు. కార్యక్రమంలో కాగిత రవి, ధూపాటి వెంకటేశ్వర్లు, మద్దాల రవీంద్ర, సిహెచ్ జాన్ వెస్లీ, షేక్ సుభానీ, సాంబ సాంబశివరావు పాల్గొన్నారు.