చీరాల : వైద్యరంగంలో ఆవిష్కృతమవుతున్న ఆధునిక పరికరాలను చీరాల ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ ఎండి డాక్టర్ తాడివలస దేవరాజు ముందున్నారని వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ కరణం వెంకటేష్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి, రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు అన్నారు.
బాపట్ల జిల్లా చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ లో డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలు అందించేందుకు డయాలసిస్, లేజర్ యూనిట్స్ ప్రారంభోత్సవానికి చీరాల నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు, చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, డాక్టర్ అమృతపాణి, డాక్టర్ పెరుగు పవన్ కుమార్, డాక్టర్ ఎస్ వి కృష్ణారావు, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, డాక్టర్ పివి ప్రసాద్, డాక్టర్ భవాని ప్రసాద్, డాక్టర్ శ్రీకాంత్, ప్రముఖ వైద్యులు హాజరై వారి అమృత హస్తాలతో నూతన డయాలసిస్, లేజర్ యూనిట్స్ ను ప్రారంభించారు.
వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలోని వైద్యులు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఎవరి వృత్తి వాళ్ళు స్వేచ్ఛగా చేసుకునే అవకాశం ఉందన్నారు. అన్ని వర్గాలకు ఎప్పుడు అండగా ఉంటామని తెలిపారు. చీరాలలో డాక్టర్ తాడివలస దేవరాజు సేవలను కొనియాడారు. ప్రతీ ఒక్కరూ ఎక్కువగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ సరైన అవగాహన లేక ఏ హాస్పటల్ కి వెళ్లలో తెలియకుండా ఉంటారని అటువంటి అవసరం ఇప్పుడు లేదని అన్నారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ లో డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నూతనంగా కిడ్నీ సమస్యలకు వైద్య సేవలు కూడా అందుబాటులోకి తీసికొనివచ్చి ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పిస్తూ ఉన్నారని అన్నారు.
వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అమృతపాణి మాట్లాడుతూ జేబులో డబ్బులు ఉన్న లేకున్నా చేతిలో తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తూ ప్రజల ఆరోగ్యానికి భరోసాగా శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ ఉందని అన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన చీరాలలోని శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ మన చెంతకు తెచ్చిందన్నారు. పేదవాడి ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్యులచే అత్యాధునిక ఉచిత వైద్య సేవలు అందిస్తూ ఉందని అన్నారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి నిండైన భరోసా కల్పిస్తూ అర్ధోపెడిక్, జనరల్, లాప్రో స్కోపీ ఆపరేషన్లు అందుబాటులోకి తీసికొని వచ్చారని తెలిపారు.
మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ ఎండి డాక్టర్ తాడివలస దేవరాజు కృషితో సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా చీరాలలోనే కిడ్నీ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవలు ఆరోగ్య శ్రీ ద్వారా అందించటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బుర్ల వెంకట్రావు, బుర్ల మురళి, చీరాల మున్సిపాలిటీ కౌన్సిలర్లు మల్లెల లలిత రాజశేఖర్, గోలి స్వాతి రవి, సూరగని లక్ష్మి, గోలి జగదీష్, పేర్లి నాని, మామిడాల రాములు, ఉల్లిపాయల సుబ్బయ్య, అనిల్, అశోక్, చుందురి వాసు, వివిధ సంఘాల నాయకులు, చీరాల ప్రజలు, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్య బృందం డాక్టర్ ముకేష్ రెడ్డి, డాక్టర్ రాజీవ్ రెడ్డి, డాక్టర్ వినయ్, డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ నాగుర్ భాష, మరియు హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.