Home ప్రకాశం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్ హరీష్ యాదవ్

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్ హరీష్ యాదవ్

485
0

– నడుము, మెడ నొప్పులను అశ్రద్ధ చేయొద్దు : డాక్టర్ చైతన్య చౌదరి
– అందరికి ఆరోగ్యమే శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ లక్ష్యం
– బోయినవారిపాలెంలో విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం
చీరాల : బోయినవారిపాలెంలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బీపీ షుగర్, ఎముకల సమస్యలపై ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో జనరల్ ఫిజీషియన్ చింతల హరీష్ యాదవ్, ఎముకలు స్పెషలిస్ట్ డాక్టర్ చైతన్య చౌదరి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తాడివలస దేవరాజు మాట్లాడుతూ చీరాలలో కార్పొరేట్ వైద్య సేవలు అందించిన ఘనత తమ హాస్పిటల్‌కే చెందుతుందన్నారు. గుంటూరు, విజయవాడ వెళ్ళనవసరం లేకుండా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ప్రతివారం చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్నారని తెలిపారు.
ఎముకలు విరిగిన వారికి, ఎముకుల సమస్యలతో బాధపడే వారికి ఉచితంగా ఆపరేషన్లు, అన్ని జనరల్, లాప్రోస్కాప్రి ఆపరేషన్ ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు.

డాక్టర్ చింతల హరీష్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని చెప్పారు. ఆహారం తీసుకోవడంలో సమయపాలన పాటించాలన్నారు. షుగర్, బీపీ ఉన్నవాళ్లు డాక్టర్ సూచనలు పాటిస్తూ మందులు ఆపకుండా వాడాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

డాక్టర్ చైతన్య చౌదరి మాట్లాడుతూ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు మెట్లు ఎక్కడం, క్రింద కూర్చోవడం చేయకూడదన్నారు. మెడనొప్పి, నడుము నొప్పులను అశ్రద్ధ చేయకుండా మొదటి దశలోనే చికిత్స తీసుకోవాలని తెలిపారు. వైద్య శిబిరంలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్య బృందం, సిబ్బంది, బోయినవారిపాలెం పెద్దలు పాల్గొన్నారు.