Home క్రైమ్ రాపర్లలో విషాదం : 9మంది మృతి

రాపర్లలో విషాదం : 9మంది మృతి

413
0

నావులుప్పలపాడు : రాపార్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మిరపకాయలు కోత పని ముగించుకుని తిరిగి ట్రాక్టర్ లో ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ పై వస్తున్న వ్యవసాయ కార్మికులు ప్రమాద వశాత్తు మార్గమధ్యంలో ఉన్న విద్యుత్ హైటెన్సన్ వైర్లు తగిలి 9మంది దుర్మరణం పాలయ్యారు. మృతులు అందరూ రాపర్ల గ్రామానికి చెందిన వారు. ఈ సంఘటనతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం అలుముకుంది. ఘటనాస్థలనికి చేరుకున్న పోలీసులు మృతులను గుర్తించారు. నాగులుప్పలపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కూలీలు మృతి బాధాకరం : విద్యుత్ శాఖ మంత్రి బాలినేని

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మాచవరం గ్రామంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో రైతు కూలీలు మృతి చెందడం బాధాకరమని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే మృతి చెందిన కుటుంబసభ్యులకు రూ.5లక్షల
నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. గాయ పడినవారికి మెరుగైన వైద్య చికిత్స అందజేస్తామన్నారు.

మృతుల కుటుంబాలకు మాగుంట సంతాపం

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మాచవరం గ్రామంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో
రైతు కూలీలు మృతి చెందడం చాలా
బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

మృతుల కుటుంబాలకు జూపూడి సంతాపం

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో ట్రాక్టరు ప్రమాదంలో కూలీలు మరణించిన ఘటనపై వైసిపి నాయకులు జూపూడి ప్రభాకరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.