Home బాపట్ల శ్రీ గౌతమిలో క్యాంపస్ డ్రైవ్‌లో 72 మంది ఉద్యోగాలకు ఎంపిక

శ్రీ గౌతమిలో క్యాంపస్ డ్రైవ్‌లో 72 మంది ఉద్యోగాలకు ఎంపిక

26
0

చీరాల (Chirala) : స్థానిక శ్రీ గౌతమి డిగ్రీ కాలేజీలో (Sri Gouthami Degree College) నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్‌లో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొని ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహించారు. ఇంటర్వూల్లో 72 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఎంపికైన విద్యార్థులు బెంగళూరు (Bengulur) లో విధులు నిర్వహించాల్సి ఉంటుందని ఆయా కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్‌లో కోజెంట్‌ ఇ సర్వీస్‌ (Cogent e services) సంస్థలో 26 మంది, ఫ్లిప్‌కార్ట్‌ (Flopkart) సంస్థలో 21 మంది, ఫాక్స్‌కాన్‌ (Foxconn) సంస్థలో 25 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల సెక్రకటీ అండ్‌ కర్పాండెంట్‌ ఎం వెంకటేశ్వర్లు (ఎంవి) తెలిపారు.

విద్యార్థుల ప్రతిభ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించిన అనంతరం ఆయా సంస్థల ప్రతినిధులు ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. కోజెంట్‌ ఇ సర్వీస్‌ సంస్థ హెచ్‌ఆర్ చైతన్య, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ హెచ్‌ఆర్ సంజయ్, ఫాక్స్‌కాన్‌ సంస్థ హెచ్‌ఆర్ ప్రితమ్ ఎంపికలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంవి మాస్టారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు, పురోగతే కళాశాల లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణ, కమ్యూనికేషన్ నైపుణ్యాభివృద్ధి తరగతులు, ప్లేస్మెంట్ ట్రైనింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మల్టీ నేషనల్ కంపెనీలను కళాశాలకు ఆహ్వానించి ఎక్కువ మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ వరప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. కళాశాల డైరెక్టర్ వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎస్‌కె సుభాని విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.