చీరాల (DN5 News) : సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో సర్వీస్ నౌటూల్‌పై గత 6 రోజులుగా నిర్వహిస్తున్న వర్క్ షాపు విజయవంతంగా ముగిసినట్లు కళాశాల సెక్రటరి వనమా రామకష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో గత 6రోజులుగా బిటెక్ 2వ, 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్ధులకు సర్వీస్ నౌటూల్‌పై శిక్షణ ఇచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు.
కంప్యూటర్ సొసైటి ఆఫ్ ఇండియా ఆద్వర్యంలో సికింద్రాబాద్ నెక్స్‌ట్ జెన్ సహకారంతో సర్వీస్ నౌ టూల్‌పై గ్లోబల్ సర్టిఫికెట్ కోర్సు జె వంశీ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు సిఎస్ఇ విభాగాధిపతి డాక్టర్ పి హరిణి తెలిపారు. సర్వీస్ నౌ టూల్‌పై విద్యార్ధులకు అవగాహన కల్పించి వాటిపై ప్రయోగాలు నిర్వహించారని తెలిపారు. ఆధునిక కంప్యూటర్ ప్రపంచంలో సర్వీస్ నౌ టూల్ ఎంతో ప్రాముఖ్యత వహిస్తున్నదని అన్నారు. వర్క్ షాపునకు టి శేషసాయి కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. సభలో డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు, వనమా దొర నాగ సాయినాద్ పాల్గొన్నారు.






