Home ప్రకాశం కొణిజేడులో 33కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి బాలినేని

కొణిజేడులో 33కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి బాలినేని

335
0

టంగుటూరు (దమ్ము) : ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కొణిజేడులో మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, వైసీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జ్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. అనంతరం బాలినేని 33 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. గ్రామంలో గత కొంత కాలంగా విద్యుత్ సమస్య ఉన్నందున రూ.3.5కోట్ల నిధులతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించటం సంతోషకరంగా ఉందని అన్నారు. టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సహకారంతో టిటిడి కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సిసి రోడ్లు, ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మహిళలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో రైతులకు పాసుపుస్తకాలు, రేషన్ కార్డులు తదితర విషయాలలో సమస్యలేమైనా వస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో వైస్సార్ సీపీ టంగుటూరు మండల నాయకులు రావూరి అయ్యవారయ్య, మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిబాబు, ఒంగోలు పార్లమెంట్ వైద్యవిభాగం అధ్యక్షులు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, ఎంబిసి డైరెక్టర్ పుట్టా వెంకట్రావు, వైసీపీ నాయకులు బొట్ల రామారావు, రమణారెడ్డి, కోటిరెడ్డి, సామంతుల రవిరెడ్డి, డేవిడ్ పాల్గొన్నారు.