చీరాల : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30శాతం మద్యంతర బృతి ప్రకటించాలని ఎంఎల్‌సి కత్తి నరసింహారెడ్డి డిమాండు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు డిసెంబరు నాటిని నూతన వేతన స్కేలు అమలు చేయాలని కోరారు. చీరాల పర్యటనకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేయాలని కోరారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు 506జిఒ ప్రకారం బదిలీలు, పదోన్నతులు ఇవ్వాలని కోరారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండు చేశారు. సమావేశంలో ఎస్‌టియు నాయకులు వంకా ప్రభాకరరావు, శివప్రసాదు, రమేష్, పవని భానుచంద్రమూర్తి, ఆదిశేషు పాల్గొన్నారు.