కారంచేడు : స్వర్ణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజు రాపిడ్ కోవిడ్ టెస్ట్ లు నిర్వహించినట్లు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎం విక్టర్ పాల్ తెలిపారు. పొడి దగ్గు, జ్వరం, తలనొప్పి, విరోచనాలు, అలర్జీ వంటి లక్షణాలతో ఎవరైనా బాధపడుతుంటే తమ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తో పేరు నమోదు చేయించుకుని రాపిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరారు. ఫలితాలను వెంటనే వెల్లడిస్తామని తెలిపారు. ఉచితంగా ప్రభుత్వం అందించే మెడికల్ కిట్ పొందగలరని సూచించారు.
అదేవిధంగా ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ ఉంటే ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ వాళ్లు కూడా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. గ్రామ ప్రజలు అందరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని చెప్పారు. కోవిడ్ నిబంధనలు ఉన్నాయని, ప్రజలంతా జాగ్రత్తలు పాటించి వైద్య ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఈ మీనా కుమారి, స్టాఫ్ నర్స్ బాల, ఎల్ టి బయ్య శంకర్, ఫార్మాసిస్ట్ జ్యోత్స్న, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
స్వర్ణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 7గ్రామాల్లో మొత్తం 85పాజిటివ్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఈరోజు 50మందికి రాపిడ్ పరీక్షలు చేయగా 21 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.