Home ఆంధ్రప్రదేశ్ 98డీఎస్సీ అర్హులకు న్యాయం చేయాలని మంత్రికి వినతి

98డీఎస్సీ అర్హులకు న్యాయం చేయాలని మంత్రికి వినతి

660
0

ఉభయగోదావరి జిల్లాల 98డీఎస్సీ క్వాలిఫైడ్ మిత్రుల ఆహ్వానంతో వైఎస్సాఆర్ 98డీఎస్సీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితను కలిసి తమ సమస్యపై వివరించారు. మంత్రి స్పందిస్తూ మీ సమస్య విద్యామంత్రిసురేష్ తో మాట్లాడానని చెప్పారు. ముఖ్యమంత్రితో కూడా మాట్లాడుతానని చెప్పారు. 98డీఎస్సీ అభ్యర్థుల సమస్యపై అవగాహన వున్నదని చెప్పారు. మంత్రిని కలిసినవారిలో సంఘ కోశాధికారి బి శ్రీనివాసరావు, పశ్చిమగోదావరి జిల్లా నాయకులు బెనర్జీ, డిఎన్నార్ సహా 30మంది పాల్గొన్నారు.