అమరావతి : 1998డిఎస్‌సి క్వాలిఫైడ్ అభ్యర్ధులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ క్వాలిఫైడ్ అభ్యర్ధులు ఆందోళనబాట పట్టారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తమకు ఉద్యోగాలు కల్పించాలని, తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకే వచ్చానని పేర్కొన్నారు.