Home ప్రకాశం సెయింట్ ఆన్స్ లో నూరు శాతం సీట్ల భర్తీ

సెయింట్ ఆన్స్ లో నూరు శాతం సీట్ల భర్తీ

268
0

చీరాల : సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 కన్వీనర్ కోట నూరు శాతం సీట్లు భర్తీ అయినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఏపీ ఈఏపీ ఎంట్రన్స్ టెస్ట్ కన్వీనర్ ప్రకటించిన ర్యాంకులు వారి సీట్ల కేటాయింపులు నూరు శాతం భర్తీ అయినట్లు ప్రిన్సిపల్ ఎం వేణుగోపాల్ తెలిపారు. పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కావడం తమకు గర్వకారణం అన్నారు. నూరు శాతం సీట్లు భర్తీ అయిన కళాశాలలో తమ కళాశాల బాపట్ల జిల్లాలో ఒకటని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందించడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కళాశాల యాజమాన్యంపై ఎంతో నమ్మకం ఉంచి పిల్లలను చేర్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. నూరు శాతం సీట్లు పూర్తి అయిన సందర్భంగా భారీ కేకును కట్ చేసి, బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.