Home క్రైమ్ వేటపాలెంలో జిరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు

వేటపాలెంలో జిరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు

319
0

వేటపాలెం : ప్రకాశం జిల్లా వేటపాలెం పోలీసులు జిరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తనకు ఇష్టంలేకుండా బలవంత వివాహం చేశారని 17ఏళ్ల బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె తల్లి, వివాహం చేసుకున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి ఘటన జరిగిన ప్రాంతాన్ని బట్టి కేసును ఇంకొల్లు స్టేషన్‌కు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంకు చెందిన వ్యక్తి తన భార్యతో 15సంవత్సరాల క్రితం విడిపోయారు. అతను అదే గ్రామంలో ఉండా ఆయన భార్య జాండ్రపేటలో నివాసం ఉంటున్నారు. వీరికి పుట్టిన బాలిక తండివద్దనే ఉంటుంది. మూడునెలల క్రితం తల్లి వద్దకు వెళ్లివస్తానని వెళ్లింది. తనను తండ్రి వద్దకు తెసుకెళుతున్నట్లు చెప్పి ఈనెల 25న ఇంకొల్లు మండలం పావులూరు ఆంజనేయస్వామిగుడిలో తనకు ఇష్టం లేకుండా పాతచీరాలకు చెందిన పిట్టు వంశీకృష్ణతో బలవంతంగా వివాహం చేసి ఇంట్లో పెట్టి తాళం వేశారని ఫిర్యాదులో పేర్కొంది. వారివద్దనుండి తప్పించుకుని వచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలిక ఫిర్యాదు మేరకు జిరొ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును ఇంకొల్లు స్టేషన్‌కు బదిలీ చేసినట్లు తెలిపారు.