చీరాల : ప్రభుత్వం సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు సక్రమంగా అందించాలని కొత్తపేట పంచాయతీ కార్యదర్శి బి రమేష్ బాబు అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో ఆయన సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నూతనంగా సచివాలయాల్లో చేపట్టిన హౌస్ మ్యాపింగ్ సర్వేలను త్వరితగతిన పూర్తి చేసి నివేదిక అందించాలని అన్నారు. ప్రజలు పంచాయతీకి చెల్లించాల్సిన పనులు సకాలంలో చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల నుండి వస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు సచివాలయాల్లో పరిష్కార దిశగా సిబ్బంది కృషి చేయాలని అన్నారు. ముఖ్యమైన సమస్యలేమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.