చీరాల : నియోజకవర్గంలో సాగునీటి కోసం రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ఎంఎల్ఎ కొండయ్య నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు దృష్టికి తీసుకువెళ్ళారు. అమరావతిలో మంగళవారం జరిగిన వర్క్ షాప్ అనంతరం ఆయన ఇరిగేషన్ స్కీం, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతుల సమస్యల పరిష్కారంపై మంత్రి నుండి హామీలు తీసుకున్నారు.